విరివెన్నెల చిరు జాబిలి
కమలాకాంత్‌గా అలనాటి తెలుగు పాఠకులకు చిరపరిచితులైన శ్రీ వఝా సీతారామ శర్మ
పుట్టి పెరిగింది గుంటూరు జిల్లా పల్లెకోనలో. ఇపుడు స్థిరపడింది ముంబాయిలో.
ఎన్నో కవితలు, కథలు, నవలలతో ఆయన తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు.
అమితమైన మనస్తత్వ పరిశీలనా, అధ్యయనమూ, వ్రాసిన ప్రతి పదానికీ ప్రాణం
పోస్తుంటే... భీరువుల వీపు తట్టి బ్రతుకు సమరపు పాఠాలు బట్టీ పట్టించే కవిత
కమలాకాంత్ స్వంతమంటూ 1970లో డాక్టర్ పరుచూరి రాజారాం గారు యుగసంగీతం
ముందు మాటలో చెప్పిన మాట అక్షర సత్యం. వివిధ పత్రికలలో వెలువడిన ఆయన
కవితలను 'అసమబాహు త్రిభుజం' సంపుటిగా వికాస ధాత్రి మీ ముందుకు తెచ్చింది. శ్రీ కమలాకాంత్ కలం నుంచి వెలువడిన జీవితంలో మలుపు, బొమ్మా బొరుసు, మమత
మానవత, ముగింపు లేని కథ, జీవన స్పర్శ, శాంత పెళ్ళి, ఆ కథ అంతే - కథా
సంపుటాలు, నవలలు - వికాస ధాత్రి వెబ్‌సైట్‌లో ఉచితంగా డౌన్‌లోడ్
చేసుకొనేందుకు అందుబాటులో వున్నాయి.
విరివెన్నెల చిరు జాబిలి
బతుకన్నది గొప్ప వరం
గతుకు బాట చేసుకోకు
మతిమాలిన వూహలతో
మనసు మలిన పరచుకోకు
సుధామధుర పాత్రలోన
విసపు చినుకు వేసుకోకు
తీయటి నీ బతుకునంత
చేదుమయం చేసుకోకు
బతుకన్నది కల్పతరువు
దాన్ని మోడు చేసుకోకు
బతుకన్నది పంట పొలం
దాన్ని బీడు చేసుకోకు
బతుకన్నది కాదు దగా
బతుకంటే కాదు పగా
దగాపగా లేని బతుకు
దివ్యమోయి నిక్కమ్ముగ
బతుకంటే మందాకిని
బతుకన్నది వానజల్లు
రౌద్ర యుద్ధ ప్రపంచాన్ని
చల్లార్చే వియద్గంగ
బతుకంటే ఒక నాటిక
బహు ముఖ పాత్రల పేటిక
బతుకన్నది ఒక మజిలీ
విరివెన్నెల చిరు జాబిలి
-- కమలాకాంత్
విరివెన్నెల చిరు జాబిలి
బతుకన్నది గొప్ప వరం
గతుకు బాట చేసుకోకు
మతిమాలిన వూహలతో
మనసు మలిన పరచుకోకు
సుధామధుర పాత్రలోన
విసపు చినుకు వేసుకోకు
తీయటి నీ బతుకునంత
చేదుమయం చేసుకోకు
బతుకన్నది కల్పతరువు
దాన్ని మోడు చేసుకోకు
బతుకన్నది పంట పొలం
దాన్ని బీడు చేసుకోకు
బతుకన్నది కాదు దగా
బతుకంటే కాదు పగా
దగాపగా లేని బతుకు
దివ్యమోయి నిక్కమ్ముగ
బతుకంటే మందాకిని
బతుకన్నది వానజల్లు
రౌద్ర యుద్ధ ప్రపంచాన్ని
చల్లార్చే వియద్గంగ
బతుకంటే ఒక నాటిక
బహు ముఖ పాత్రల పేటిక
బతుకన్నది ఒక మజిలీ
విరివెన్నెల చిరు జాబిలి
-- కమలాకాంత్
Post a Comment