విరివెన్నెల చిరు జాబిలి

కమలాకాంత్‌గా అలనాటి తెలుగు పాఠకులకు చిరపరిచితులైన శ్రీ వఝా సీతారామ శర్మ పుట్టి పెరిగింది గుంటూరు జిల్లా పల్లెకోనలో. ఇపుడు స్థిరపడింది ముంబాయిలో. ఎన్నో కవితలు, కథలు, నవలలతో ఆయన తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. అమితమైన మనస్తత్వ పరిశీలనా, అధ్యయనమూ, వ్రాసిన ప్రతి పదానికీ ప్రాణం పోస్తుంటే... భీరువుల వీపు తట్టి బ్రతుకు సమరపు పాఠాలు బట్టీ పట్టించే కవిత కమలాకాంత్‌ స్వంతమంటూ 1970లో డాక్టర్‌ పరుచూరి రాజారాం గారు యుగసంగీతం ముందు మాటలో చెప్పిన మాట అక్షర సత్యం. వివిధ పత్రికలలో వెలువడిన ఆయన కవితలను 'అసమబాహు త్రిభుజం' సంపుటిగా వికాస ధాత్రి మీ ముందుకు తెచ్చింది. శ్రీ కమలాకాంత్‌ కలం నుంచి వెలువడిన జీవితంలో మలుపు, బొమ్మా బొరుసు, మమత మానవత, ముగింపు లేని కథ, జీవన స్పర్శ, శాంత పెళ్ళి, ఆ కథ అంతే - కథా సంపుటాలు, నవలలు - వికాస ధాత్రి వెబ్‌సైట్‌లో ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకొనేందుకు అందుబాటులో వున్నాయి.విరివెన్నెల చిరు జాబిలి

బతుకన్నది గొప్ప వరం
గతుకు బాట చేసుకోకు
మతిమాలిన వూహలతో
మనసు మలిన పరచుకోకు

సుధామధుర పాత్రలోన
విసపు చినుకు వేసుకోకు
తీయటి నీ బతుకునంత
చేదుమయం చేసుకోకు

బతుకన్నది కల్పతరువు
దాన్ని మోడు చేసుకోకు
బతుకన్నది పంట పొలం
దాన్ని బీడు చేసుకోకు

బతుకన్నది కాదు దగా
బతుకంటే కాదు పగా
దగాపగా లేని బతుకు
దివ్యమోయి నిక్కమ్ముగ

బతుకంటే మందాకిని
బతుకన్నది వానజల్లు
రౌద్ర యుద్ధ ప్రపంచాన్ని
చల్లార్చే వియద్గంగ

బతుకంటే ఒక నాటిక
బహు ముఖ పాత్రల పేటిక
బతుకన్నది ఒక మజిలీ
విరివెన్నెల చిరు జాబిలి
-- కమలాకాంత్‌

అందని 'ప్రేమ లేఖ'స్వప్నా,
ఎందుకో కలం ముందుకు సాగనంటోంది. గుండె ఈ క్షణాన తాను మూగనంటోంది. ఎలా వ్రాసేది నేను వణికే ఈ చేతితో? ఎలా పలికేది నేను గుండె గొంతుకలో కొట్టాడుతోంటే?
ఉలి తాకిడికే ఉలిక్కిపడి వళ్లంతా కళ్లు చేసుకు చూసిన శిల సుందరమైన శిల్పమైనట్లు - ఏ స్పందనా లేని వెదురు గాలిని తోడు చేసుకొని ప్రకృతినే కదిలించే వేణువైనట్లు - నీ పరిచయం ఏవేవో కొత్త ప్రపంచ ద్వారాల్ని నాలో తెరిచింది.
అప్పుడప్పుడు అసలిదంతా ఎలా ప్రారంభమైందీ అని ఆలోచిస్తే, రాత్రంతా మంచులో తడిసిన మల్లెమొగ్గ ఏ క్షణాన రేకులు విప్పుకు వళ్లు విరుచుకుంటుందో..... నీరెండల ఛాయలలో హరివిల్లే క్షణాన తొలకరిస్తుందో... - ఆ క్షణాల్ని ఎలా పట్టుకోగలమనిపిస్తుంది.
బహుశా నీకు గుర్తుండే వుంటుంది. మే నెలాఖరు రోజుల్లో ఎప్పట్లానే ఇంటి ముందు అరుగుల మీద సోమరిగా గోళ్లు గిల్లుకొంటూ కూర్చొని వచ్చి పోయే వాళ్లను చూస్తో నేను అదే తొలిసారి నిన్ను చూడటం!

పాపి గాడి పిల్లి….


పాపి గాడి పిల్లి…. 
పారి పోయింది.
“పొద్దుట్నుంచి వెధవ పిల్లి కనపడలేదని అటూ ఇటూ తిరిగినవాళ్ళు తిరిగినట్టు ఉన్నారే గాని, పెద్ద ముండని, నా మొహాన కనీసం ఒక ముద్దైనా అన్నం పడేసారే! కనీసం కాఫీ నీళ్ళైన పొయ్యట్రే!!” అని అరుస్తోంది పాపి గాడి నాయనమ్మ.
పాపిగాడేమో, పిల్లి కనపడలేదని బెంగెట్టుకుని, జ్వరం తెచ్చుకుని, స్కూలు మాని మరీ, ఏడుస్తున్నాడు. స్నానం కూడా చెయ్యకుండా... ఉండలు కట్టిన మట్టి తలతో, నేల మీద పడి దేకుతున్నాడు. మధ్య మధ్యలో  సోకాలు వేరె.
భాస్కర్ మటుకు, తనకేవి పట్టనట్టు పేపర్ చదువుకుంటూ, ఆరోజు  పేపర్ కదా, కనీసం ఇంకెవరైనా చదువుతారెమో, అన్న ఇంగితం కూడా లెకుండా, పేపెర్ మీదే గోళ్ళు కత్రించుకుంటున్నాడు.
ఇవన్నీ జరుగుతూంటే,  పక్క పాకల్లో  ఉన్న అప్పల్రాజుకి, పని మనిషి కనకం ద్వారా, కబురు పెట్టింది వసుంధర. అదే టైంలో చాకలి లింగమ్మ రావటం తో అందరికీ చెప్పింది,“మా పాపిగాడి పిల్లి ఎక్కడైనా కనపడితే పట్టుకు రండర్రా.”
ఆ మాట విని అప్పల్రాజు అన్నాడూ…”అమ్మ గారు! ఏ బండి కింద అయినా పడి చచ్చిపొనాదేమొ”....
“ఛి!! ఊరుకోరా!! వాడు వింటే, నన్ను కాల్చుకు తింటాడు”...
ఇంతలో లింగమ్మ “అమ్మ గారు!” అని సాగదీస్తూ “పిల్లికి తొమ్మిది జనమలు ఉంటాయట!? అమ్మ గారు, నిజమేనా?”
“ఏమో నే బాబు, ఈ పిల్లి పారిపోవటం నా ప్రాణనికి వచ్చింది...వెతికి తెస్తే, మీకు నెల జీతం పెంచుతా.” వసుంధర మాట పూర్తి కానేలేదు, పేపర్ ని చక చక  ఉండచుట్టి, విసిరి కొట్టి, ఉన్నపళంగా రెండే అంగల్లొ, వీధిలోకి వచ్చాడు భాస్కర్.
“వెధవ పిల్లి కోసం మళ్ళీ ఇదొకటా...దాని మొహాన పాలు పోసినా, దాని రుబాబు దానిదే...ఎంత దగ్గర చేసిన...దాని టెక్కు దానిదే... వెధవ టెంపెర్. ఆఫీసు నుంచి రాగనే మనం దాని ఇంట్లో ఉన్నట్టు మొహం తిప్పుకుంటుంది ... అదేదో నేను దానికి బాకి పడ్డట్టు. ఇంతకన్నా కుక్కే నయం, కనీసం ఒక ముద్ద పడేస్తే విశ్వాసంగ పడి ఉంటుంది.
వాడెవడూ.... పాపి గాడి ఫ్రెండు, ఎంచక్కా కుక్కని పెంచుకున్నాడు. వీడికి ఒక కుక్క కొన్నా పోయేది . ఈ పిల్లి ముండ!! అదే వచ్చింది. మూడెల్లు ఉంది గా మరి. ఏం ముంచుకొచ్చిందో, పారి పోయింది. దాని మానాన అదే పోయింది. ఇంక దానిమీద ఒక్క పైసా పెట్టను.”                        

స్టార్ట‌ప్ ను ఇలా గెలిపించండి

నాలుగు రోడ్ల కూడ‌లి.
"నేను ఏ దారిన వెళ్ళాలి?" అడిగాడు కుర్రాడు.
"ఎక్క‌డ‌కి వెళ్ళాలి?" దిక్కులు చూస్తున్న పిల్లాడ్ని అడిగాడు పెద్దాయ‌న‌.
"అదీ తెలియ‌దు"
"అయితే ఏ దారి  అయినా ఒక‌టే." చెప్పాడు పెద్దాయ‌న‌.
మ‌న దేశంలోని చాలామంది యువ‌తీ యువ‌కుల ప్ర‌తినిధి ఆ కుర్రాడు.
ఎందుకు చ‌దివారో తెలియ‌దు, చ‌దివి ఏం చేయాల‌నుకుంటున్నారో తెలియ‌దు. ర్యాంకుల కోసం పోరాటం, మార్కుల కోసం ఆరాటం, ఉద్యోగం కోసం కిందామీదా ప‌డ‌టం. ఉద్యోగం వ‌స్తే, సెటిల్డ్ ఫీలింగ్ తో  జీవితానికి సెక్యూరిటీ వ‌చ్చేసింద‌ని న‌మ్మ‌టం. చాలా భద్రంగా ఏ ఒడిదుడుకులూ లేని, ఏ మార్పులూ లేని జీవితాన్ని ఒకేలా గ‌డిపేయ‌టం....ఇది ఎంద‌రో చేసే ప‌ని! క‌నిపించిన‌ ఏదో ఒక దారిలో త‌లొంచుకు న‌డుచుకుపోవ‌టం.

ల‌క్ష్యం ఏమిటో ముందే నిర్ణ‌యించుకోవ‌టం, ఆ ల‌క్ష్యాన్ని చేరుకొనే దారుల‌ను అన్వేషించ‌టం, ఏ దారీ లేద‌నుకుంటే కొత్త దారులు వేయ‌టం - కొంద‌రే చేయ‌గ‌ల ప‌ని. అలా కొత్త దారుల‌ను అన్వేషిస్తున్న, కొత్త దారుల‌లో ప‌య‌నించాల‌ని క‌ల‌లు కంటున్న‌ న‌వ యువ‌కుల కోసం సురేశ్ రాసిన పుస్త‌కం ఇది. ఒక దార్శ‌నిక‌త‌తో, వ్యూహంతో, ఆశావ‌హ దృక్ప‌థంతో, ల‌క్ష్యాన్ని ఎలా సాధించవ‌చ్చో ఈ పుస్త‌కం వివ‌రిస్తుంది.
ఇంట‌ర్నెట్ అంటేనే గూగుల్ అనుకుంటాం మ‌నం. సైడ్ వికి, పిక్నిక్‌, ఆర్డ్‌వార్క్‌, గూగుల్ నోట్‌బుక్‌, గూగుల్ డిక్ష‌న‌రీ, ల్యాబ్స్‌, ఐ గూగుల్‌, గూగుల్ టాక్‌, గూగుల్ హెల్త్‌, నోల్‌, జైకు, గూగుల్ పేజ్ క్రియేట‌ర్‌, గూగుల్ లైవ్‌లీ, గూగుల్ ఆన్స‌ర్స్ - ఇవ‌న్నీ గూగుల్ ప్రాజెక్టులే. అతి కొద్ది కాలంలోనే మూత‌ప‌డ్డాయి. ఏ విజ‌యంలో అయినా అప‌జ‌యాలుంటాయనేందుకు ఇదే ఒక పెద్ద ఉదాహ‌ర‌ణ‌. క‌నుక జ‌యాప‌జ‌యాల గురించి అంత‌గా ఆందోళ‌న చెంద‌కుండా, మ‌నం ప్ర‌య‌త్నం మీద‌నే దృష్టి పెట్టాలి.
ఆ కాల‌పు న్యూట‌న్, ఎడిస‌న్, పికాసో లు కావ‌చ్చు. ఈ కాల‌పు స్టీవ్‌జాబ్‌, లారీ పేజ్‌, జుక‌ర్ బర్గ్ కావొచ్చు. రాత్రికి రాత్రే గొప్ప‌వాళ్ళ‌యి పోలేదు. నిద్ర లేని రాత్రుల‌తోనే అయ్యారు. రిస్క్ లేని జీవితం గ‌డ‌ప‌లేదు. రిస్క్‌ల‌తోనే జీవితం గ‌డిపారు. ఏ ప్ర‌య‌త్నంలో అయినా గెలుపూ ఓట‌మీ క‌ల‌గ‌లిసే వుంటాయి. మారే ప‌రిస్థితులూ, ఎదురౌతున్న ఫ‌లితాలకు అనుగుణంగా ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త వ్యూహాల‌తో ముందుకు పోవ‌టమే అస‌లైన విజ‌యం.
స్టార్ట్ అప్ ల పేరిట న‌వ్య‌మైన ఆలోచ‌న‌ల‌తో, ఆవిష్క‌ర‌ణ‌ల‌తో ఆకాశ‌మే హ‌ద్దుగా ఎద‌గాల‌నుకుంటున్న యువ‌త‌కు చేయూత‌నిస్తూ, మార్గ‌ద‌ర్శ‌కంగా నిలిచే స్టార్ట‌ప్ ను ఇలా గెలిపించండి పుస్త‌కంతో మ‌న ముందుకు వ‌స్తున్న సురేశ్‌కి అభినంద‌న‌లు.

వ‌ర్క్ ప్లేస్ మేనేజ్‌మెంట్ పుస్త‌కాల సిరీస్‌లో భాగంగా సురేశ్ వెలుగూరి 'ఆలోచించండి, ప్రారంభించండి, ఎద‌గండి' అని పిలుపునిస్తూ వ్రాసిన పుస్త‌కం - స్టార్ట‌ప్ ను ఇలా గెలిపించండి. 

ప్ర‌చుర‌ణ : విఎంఆర్‌జి ఇంట‌ర్నేష‌న‌ల్‌, ధ‌ర : 300 రూపాయ‌లు
పుస్త‌కం ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయ‌వ‌చ్చు. 
Buy Book

జ్ఞాప‌కాల ప‌రిమ‌ళం


ముప్పైలలో...
అందరిలాగే సెలవులుంటే నా లోని ఖాళీని నింపాలనే ప్రయత్నం తో 
వేల్స్  లోని,  సముద్రానికి  దగ్గరగా  ఉండే  పోర్టుమెరిన్ కి వెళ్ళాం
అది కల లాంటి ఒక గ్రామం అట, ప్రతి ఇల్లు రంగు రంగుల ఒక వింత కట్టడం అట
ఆ ఊరి సముద్రచీలిక ఒడ్డున, ఎగిరే పక్షులని చూస్తూ నించుంటే 
గుప్పుమంటూ ఒక మెరుపు దాడి
        తలతిప్పి  చూస్తే అచ్చంగా కత్తులు పట్టిన సైన్యంలా ఒక గులాబీల తోట 
        ఎన్నోసార్లు  గులాబీ అందం చూసాను
        కానీ,  ఆరోజు  ఆ సుగంధంలో గులాబీలోని  అసలు వింతని చూసాను

ఇరవైలలో...
ఫ్రెండ్  ఇంటి  డాబా  మీద  సాయంత్రం  విరజాజి  మొగ్గలు  కోసి,
వాళ్ళ  అమ్మకి  సాయం  చేసాననుకున్నాను  
వాళ్ళ  ఇంట్లో  నేను  గడిపిన  ఆనందమైన  సమయాన్ని  గిఫ్ట్  వ్రాప్  చేసినట్టు 
మొగ్గలన్ని మాల  కట్టి  నాకిచ్చేది  ఆ  మహాతల్లి!

Loser in life's loveI feel, some of the tastes and preferences that I have had as a kid are very original and therefore precious as they were formed without any measure of external standard of what is generally accepted. It is as if, in a world full of stimuli I was almost drawn to very few images, things and people intuitively. Of some of such likings that I have had from a very small age are the face of Jiddu Krishnamurti, visuals of Vamsi's movies and therefore inseparably Illayaraja's music.
As a kid and sometimes even now, I often feel a terrible sense of urgency. It is as if my thoughts have a tough time catching up with what I feel, let alone being able to express verbally. Perhaps Vamsi's visuals in his movies, have met my excitement and urgency in such a way that I often wonder what would have been my plight if someone in this world never resonated with my depth of excitement. It is no exaggeration that I find it hard to imagine how my life would have been without Vamsi's movies or Illayaraja's music.

I remember watching 'సుమం ప్రతిసుమం' in Chitralahari. I am not sure if I have felt that kind of surge of